బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 08, 2020 , 19:09:21

డాక్టర్లకు హైదరాబాద్‌ పోలీస్‌ సెల్యూట్..

డాక్టర్లకు హైదరాబాద్‌ పోలీస్‌ సెల్యూట్..

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఇవాళ కింగ్‌ కోటీ అసుపత్రని సందర్శించారు. సిటీ పోలీసుల తరపున అక్కడి వైద్యులకు, ఇతర సిబ్బందికి వారు పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందించారు. కరోనాపై పోరాటంలో డాక్టర్లది చాలా పెద్ద పాత్ర అని ఆయన కొనియాడారు. వారిగురించి ఎంత చెప్పినా తక్కువే, ఇంతటి క్లిష్ట పరిస్థితులను తన జీవీతంలో ఎన్నడూ చూడలేదని అంజనీకుమార్‌ చెప్పారు. ఇదో ఛాలెంజింగ్‌ పరిస్థితి, ప్రతి ఒక్క పౌరుడు వైద్యులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ వైద్యులకు సహకరించాలి, లాక్‌డౌన్‌ను విధిగా పాటించాలి, అనుమానం ఉన్నవారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి అని సిటీ పోలీస్‌ కమిషనర్‌ కోరారు. కింగ్‌ కోటీ ఆసుపత్రిలో ఉన్ ప్రతి డాక్టరు, నర్సు ఇతర వైద్య సిబ్బందికి పోలీసులందరి తరపున నా సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు. logo