సోమవారం 01 జూన్ 2020
Telangana - May 08, 2020 , 12:53:37

వాహన రాకపోకలతో సందడిగా మారిన నగర రోడ్లు

వాహన రాకపోకలతో సందడిగా మారిన నగర రోడ్లు

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో బోసిపోయిన నగర వీధులు తిరిగి వాహన రాకపోకలతో సందడిగా మారాయి. లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపు వల్ల హైదరాబాద్‌ నగరంలో వాహనాల రాకపోకలు పెరిగాయి. నగరంలో స్టీలు, సిమెంట్‌, ఎలక్ట్రికల్‌ షాపులు, రిజిస్ట్రేషన్‌, రవాణాశాఖ కార్యాలయాలు, మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అదేవిధంగా ఐటీ పరిశ్రమల్లోనూ 33 శాతం మంది ఉద్యోగులకు అనుమతినిచ్చారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే రహదారులపైకి 35 శాతం వాహనాలు వచ్చాయి. కాగా వెసులుబాటు కల్పించిన రంగాలకు చెందిన వాళ్లే బయటకు రావాల్సిందిగా పోలీసులు పేర్కొంటున్నారు. ఇతరులు లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తే చర్యలు తప్పని హెచ్చరించారు.


logo