బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 23:42:36

రేపటి నుంచి తెరుచుకోనున్న కంటోన్మెంట్ రోడ్లు

రేపటి నుంచి తెరుచుకోనున్న కంటోన్మెంట్ రోడ్లు

హైదరాబాద్ : రేపటి నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్లు తెరుచుకోనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి కంటోన్మెంట్ రోడ్లపై రాకపోకలకు మిలిటరీ అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని లోకల్ మిలిటరీ అథారిటీ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.  

కొవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్ ప్రాంతంలో రోడ్లు మూసివేశారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి రోడ్లను తిరిగి తెరవాలని నిర్ణయించినట్టు మిలిటరీ అధికారులు తెలిపారు.

జూలై 18 నుంచి బోల్లారం, తిరుమలగిరిలోని రహదారులను మూసివేశారు.  అలాగే కంటోన్మెంట్ పరిసర ప్రాంతాలలో కొవిడ్ పాజిటివ్ కేసుల యొక్క ఉప్పెనను తగ్గించేందుకు రోడ్లను అధికారులు మూసివేశారు. ఇకపై ఈ రోడ్లు నిత్యం ఉదయం 5.30 నుంచి 8.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల మధ్య ప్రాంగణాల శానిటైజేషన్ కోసం రోడ్లను మూసివేస్తారు.

సరైన తనిఖీలు, ధృవీకరణలతో అంబులెన్స్ లేదా అత్యవసర వైద్య కేసుల కదలికపై ఎటువంటి పరిమితి ఉండదు. మహమ్మారి వ్యాప్తి చెందడానికి సైనిక అధికారులతో సహకరించాలని పౌరులను లోకల్ మిలిటరీ అథారిటీ అభ్యర్థించింది.


logo