ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 18:33:06

గాంధీ ఆస్ప‌త్రిలో హెచ్‌హెచ్ఎఫ్ హెల్ప్ డెస్క్‌

గాంధీ ఆస్ప‌త్రిలో హెచ్‌హెచ్ఎఫ్ హెల్ప్ డెస్క్‌

హైద‌రాబాద్ : రాష్ర్టంలో కోవిడ్‌-19కు నోడ‌ల్ కేంద్రంగా ఉన్న‌గాంధీ ఆస్ప‌త్రిలో హైద‌రాబాద్‌కు చెందిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేష‌న్ అనే స్వ‌చ్ఛంద సంస్థ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. ఇటువంటి హెల్ప్ డెస్క్‌ల‌నే జిల్లా ఏరియా ఆస్ప‌త్రి, కింగ్ కోఠి, ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రి, ప్ర‌భుత్వ నిజామియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రి, ప్ర‌భుత్వ చెస్ట్ ఆస్ప‌త్రి‌లో ఏర్పాటు చేసిన‌ట్లు ఎన్జీవో తెలిపింది. గాంధీ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ డెస్క్ ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప‌నిచేయ‌నుంది. నలుగురు పేషెంట్ కౌన్సెలర్లు, రెండు అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. డెస్క్ వ‌ద్ద ఉండే కౌన్సెల‌ర్లు ముఖ్యంగా ప్రసూతి కోవిడ్ పాజిటివ్ కేసులకు సహాయం చేస్తారు. అంబులెన్స్‌లు కోవిడ్ రోగుల చేర‌వేత‌కు స‌హాయ‌ప‌డ‌నున్నాయి. ప్ర‌ధానంగా జిల్లాల నుంచి వ‌చ్చే కోవిడ్ రోగులు వారి కుటుంబ స‌భ్యుల మ‌ధ్య డెస్క్ స‌మ‌న్వ‌యక‌ర్త‌గా ప‌నిచేస్తుంది.


logo