బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 04, 2020 , 17:08:36

రేపు ఐఐసీటీ 77వ వ్యవస్థాపక దినోత్సవం

రేపు ఐఐసీటీ 77వ వ్యవస్థాపక దినోత్సవం

హైదరాబాద్‌ : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ), హైదరాబాద్‌ 77వ వ్యవస్థాపక దినోత్సవం రేపు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాసుటికల్స్‌, మినిస్ట్రీ ఆఫ్‌ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ డా. పి.డి. వాగేలా ఐఐసీటీ సిబ్బంది, విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. అదేవిధంగా డీజీ, సీఎస్‌ఐఆర్‌ అండ్‌ సెక్రటరీ, డీఎస్‌ఐఆర్‌ డా. శేకర్‌ మండే రాష్ట్రపతి ప్రసంగాన్ని వినిపించనున్నారు. 

బల్క్‌ డ్రగ్‌ మానిఫాశ్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు అరుణ్‌ తివారీ, విమ్తా లాబ్స్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అండ్‌ ఫౌండర్‌ వి.వి. కృష్ణారెడ్డి, డా.ఎస్‌.పి. వాసిరెడ్డితో పాటు శాస్త్ర, ఔషద రంగాలకు చెందిన పలువురు ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆత్మ నిర్బర్‌ భారత్‌కు సంబంధించి పలు అభివృద్ధి అంశాలను కార్యక్రమంలో చర్చించనున్నట్లు ఐఐసీటీ డైరక్టర్‌ డా. ఎస్‌.చంద్రశేఖర్‌ వెల్లడించారు.

తాజావార్తలు


logo