ఆదివారం 06 డిసెంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 02:29:09

ఆఫీస్‌ స్పేస్‌లో హైదరా‘బాద్‌షా’

ఆఫీస్‌ స్పేస్‌లో హైదరా‘బాద్‌షా’

  • ఐదేండ్లలోనే ఆరు నుంచి రెండో స్థానానికి
  • ఢిల్లీ.. చెన్నైలను దాటి ముందుకు
  • హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్న క్రమంలో ఆఫీస్‌ స్పేస్‌కు భారీ ఎత్తున డిమాండ్‌ ఏర్పడుతున్నది. పెట్టుబడుల ఆకర్షణకు సానుకూల విధానాలను అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా శ్రద్ధ చూపుతున్నది. నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఆఫీస్‌ స్పేస్‌ వినియోగంలో దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ నగరం రెండో స్థానంలో నిలిచింది. 2015లో ఆరో స్థానంలో నిలిచిన హైదరాబాద్‌ కేవలం ఐదేండ్ల వ్యవధిలోనే మెరుగైన ర్యాంకును సాధించింది. ఢిల్లీ, చెన్నై తదితర పట్టణాలను వెనుకకు నెట్టి ముందువరుసలో నిలిచింది. ‘ఆఫీస్‌ స్పేస్‌ వినియోగంలో హైదరాబాద్‌ ఆరో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఈ గణాంకాలు తెలంగాణ వృద్ధికి ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యం వల్లే ఈ ఘనత సాధ్యమైంది’ అంటూ ఐటీ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా హర్షం వ్యక్తం చేశారు.