సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 23, 2020 , 11:41:33

హైద‌రాబాద్‌కు భారీగా పెట్టుబడులు ఎందుకు వ‌స్తున్నాయో తెలుసా?

హైద‌రాబాద్‌కు భారీగా పెట్టుబడులు ఎందుకు వ‌స్తున్నాయో తెలుసా?

హైద‌రాబాద్: హైద‌రాబాద్ న‌గ‌రాన్ని పెట్టుబ‌డులు అంత‌గా ఆక‌ర్షించ‌డానికి కార‌ణాలేవి? ప‌్ర‌పంచ స్థాయిలో పేరొందిన అమెజాన్‌, గూగుల్‌, మెక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్ లాంటి సంస్థ‌లు పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎందుకు ఆస‌క్తి చూపుతున్నాయి? ప‌్ర‌పంచ పటంలో హైద‌రాబాద్ ఓ వెలుగు వెల‌గ‌నుందా? అంటే అవున‌నే అనిపిస్తోంది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకు మోదీ ప్ర‌భుత్వం కుట్ర‌లు చేస్తుంది. బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్త‌రప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌లో పెట్టుబ‌డులు ఎందుకు పెట్ట‌డం లేదు? ‌కార‌ణాలేమిటి అని విశ్లేషించుకుంటున్నారు. హైద‌రాబాద్‌కే పెట్టుబ‌డులు ఎందుకు త‌ర‌లి వెళ్తున్నాయ‌ని ఆయా రాష్ర్టాల సీఎంలు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు దృష్టి సారించారు. హైద‌రాబాదీ పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ఇతర రాష్ర్టాల అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. 

ఆదివారం హెచ్‌ఐసీసీలో హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అసోసియేషన్‌ (హైసియా) ఆధ్వర్యంలో బ్రాండ్‌ హైదరాబాద్‌పై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి హైసియా అధ్యక్షుడు భరణి కుమార్‌ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సదస్సులో మంత్రి కేటీఆర్‌ పలు అంశాలపై తన అభిప్రాయాలు, ఆలోచనలను వివరించారు.

హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డుల‌పై ఇత‌ర రాష్ర్టాల‌కు ఆస‌క్తి ఎలా ఉందో అనే విష‌యం తెలియ‌జేడానికి కేటీఆర్ ఓ మంచి ఉదాహ‌ర‌ణ చెప్పారు. 

హైద‌రాబాద్ పెట్టుబ‌డుల‌పై ఒక మంచి ఉదాహ‌ర‌ణ చెప్ప‌ద‌లుచుకున్న‌.. ఒక పారిశ్రామిక‌వేత్తకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వ్యాపారాలు ఉన్నాయి. దాంతో మూడు రోజుల క్రితం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఆ పారిశ్రామిక‌వేత్త‌ క‌లిశాడు. 20 నిమిషాల టైం ఇచ్చాడు.. నీవు వ‌చ్చిన ప‌ని త‌ర్వాత చుద్దాం కానీ.. హైద‌రాబాద్‌కు పెట్టుబడులు అధికంగా ఎందుకు వ‌స్తున్నాయి? హైద‌రాబాద్‌లో ఏం జ‌రుగుతుంది? అని ఆ పారిశ్రామిక‌వేత్త‌ను చీఫ్ సెక్ర‌ట‌రీ అడిగాడు. యూపీలో ఘ‌జియాబాద్‌, నోయిడా ఉంది క‌దా? ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టొచ్చు క‌దా? అని చీఫ్ సెక్ర‌ట‌రీ కూడా పారిశ్రామిక‌వేత్త‌కు వివ‌రించాడు. పెట్టుబ‌డుల‌ను అంత‌గా ఆక‌ర్షించ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటి? అని చీఫ్ సెక్ర‌ట‌రీ స‌దరు పారిశ్రామిక‌వేత్త‌ను ప్ర‌శ్నించాడు. 

చీఫ్ సెక్ర‌ట‌రీకి పారిశ్రామిక‌వేత్త బ‌దులిస్తూ.. సార్ తెలంగాణ‌లో సుస్థిర‌మైన ప్ర‌భుత్వం ఉంది. ప్ర‌శాంత వాతావ‌ర‌ణం, శాంతిభ‌ద్ర‌త‌లు అద్భుతంగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌టిష్ట‌మైన పాల‌న కొన‌సాగుతోంది.. ప్ర‌గ‌తిశీల విధాన నిర్ణ‌యాల వ‌ల్లే పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. పెట్టుబ‌డుల‌కు ఈ రెండు విష‌యాలు చాలా ప్రాధాన్యం. సుస్థిర ప్రభుత్వం, శాంతిభద్రతలతో తెలంగాణలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని.. వీటివల్లనే హైదరాబాద్‌కు పెద్దఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు తరలివస్తున్నాయి అని పారిశ్రామిక‌వేత్త చీఫ్ సెక్ర‌ట‌రీకి తెలిపిన‌ట్లు కేటీఆర్ వివ‌రించారు.. 

హైదరాబాద్‌ బ్రాండ్‌ఇమేజ్‌ ఏ ఒక్కరి వల్లనో, ఏ ఒక్కపార్టీ వల్లనో సాధ్యంకాలేదు. కొన్నేండ్లలోనే వచ్చిందీ కాదు. 400 ఏండ్ల చరిత్రఉన్న భాగ్యనగరం క్రమంగా ఈ ఇమేజ్‌ను పెంచుకుంటూ వచ్చింది. అయితే, గత ఆరేండ్లుగా సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యలతో ఈ ఇమేజ్‌ మరింత పెరుగుతూ వస్తున్నది. కరీంనగర్‌, హైదరాబాద్‌, పుణే, ఢిల్లీ, అమెరికాలో చదివిన నాకు ఆయా ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్‌కున్న అనుకూలతలు తెలిశాయి. హైదరాబాద్‌కు ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి అని కేటీఆర్ పేర్కొన్నారు.