గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 02:03:42

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
  • అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం
  • మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో  బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇం టర్మీడియట్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లుపూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని అన్నారు. సోమవారం నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రధాన కార్యాలయంలో పరీక్షల ఏర్పాట్లపై విద్యాశాఖ ప్రత్యే క ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. మొత్తం 9.65 లక్షల (ఫస్టియర్‌ 4,80,531, సెకండ్‌ ఇయర్‌ 4,85,345) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 1,339 పరీక్ష కేంద్రాల్లో 26,964 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇంటర్‌ పరీక్షల్లో మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను నిషేధించారు. ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు నేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోచ్చు. పరీక్ష కేంద్రాలను తెలుసుకోవడానికి సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ను రూపొందించారు. విద్యార్థులు ఎలాంటి అనుమానా లు ఉన్నా bigrs.telangana.gov.in ద్వా రా ఫిర్యాదు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలో ప్రతి సమస్యను 24 గంటల్లోనే పరిష్కరిస్తారు. 


logo
>>>>>>