బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:45:48

ఉపాధి పనుల్లో తెలంగాణ దూకుడు

ఉపాధి పనుల్లో తెలంగాణ దూకుడు

  • మూడు నెలల్లో 10.55 కోట్ల పనిదినాలు పూర్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉపాధి హామీ పనుల్లో కూలీలకు పనిదినాలు కల్పించడంలో తెలంగాణ దూకుడు కొనసాగుతున్నది.  లాక్‌డౌన్‌తో పట్టణాల్లో చిన్నచిన్న పనులు చేసుకునేవాళ్లంతా పల్లెలకు చేరారు. దీంతో మే నెలలో రికార్డు స్థాయిలో రోజుకు 25లక్షల మందికిపైగా కూలీలు పనులకు వచ్చారు. గతవారం 8 లక్షల మంది రిపోర్ట్‌ చేయగా, ప్రస్తుతం రోజుకు ఐదు నుంచి ఆరు లక్షల మంది పనులకు హాజరవుతున్నారు. మళ్లీ హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉన్నదనే వార్తల నేపథ్యంలో ఈ మధ్యే పట్టణాలకు చేరిన వారం తా తిరిగి ఊర్లకు వస్తుండటంతో ఉపాధి పనులకు డిమాండ్‌ తగ్గటం లేదు. ఆరేండ్లు గా ఉపాధి హామీ పనుల్లో నిర్దేశించిన లక్ష్యా న్ని తెలంగాణ పూర్తిచేస్తూ వస్తున్నది. గత ఏడాది 9.75 కోట్ల పనిదినాలు కల్పించగా.. ఈ ఏడాది లక్ష్యం 13.66కోట్లు. ఏప్రిల్‌, మే, జూన్‌లోనే  10.55 కోట్ల పనిదినాలు పూర్తి చేసింది. కామారెడ్డి జిల్లాలో అత్యధికం గా 85.14లక్షలు, నల్లగొండలో 62 లక్షలు, సూర్యాపేటలో 57.1లక్షలు, వికారాబాద్‌ లో 54.15 లక్షలు, ఖమ్మంలో 52.11 లక్ష లు, నిజామాబాద్‌ జిల్లాలో 50.8 లక్షల పనిదినాలు కల్పించారు. 


logo