బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 28, 2020 , 16:20:40

అగ్నిప్రమాదంలో గుడిసెలు దగ్ధం

అగ్నిప్రమాదంలో గుడిసెలు దగ్ధం

మేడ్చల్‌: జిల్లాలోని కీసర మండలం అహ్మద్‌గూడలో అగ్నిప్రమాదం జరిగింది. గుడిసెల నుంచి దూరంగా పరిగెత్తడంతో ప్రణాపాయం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గుడిసెలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్లో నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుల గుడిసెలు దగ్ధమయ్యాయి. వంట సామాగ్రీతో సహా బట్టలు అన్నీ కాలిపోయాయని బాధితులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు బాధితులకు భోజన ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామని అధికారులు తెలిపారు. 


logo