గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 21:51:43

భార్యను చంపిన భర్త

భార్యను చంపిన భర్త

గద్వాల  : భార్యాభర్తల జీవితంలో చిన్న పాటి గొడవల కారణంగా భార్యను భర్త అతి కూర్రంగా చంపిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని గోన్‌పాడులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గద్వాల మండలం పరిధిలోని గోనుపాడు గ్రామానికి చెందిన ఎరుకలి సవారమ్మ దంపతులకు నలుగురు అడపిల్లలు ఉన్నారు. మొదటి ముగ్గురు అడపిల్లలకు పెళ్లిలు చేశారు. నాలుగో కూతురు రేణుక(26)కు ఐదేళ్ల కిందట రాజోళి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన రాజుకు ఇచ్చి వివాహం చేసి ఇల్లరికం పెట్టుకున్నారు. 

గత నాలుగు సంవత్సరాల పాటు వీరి కాపురం సాఫీగా సాగింది. గత కొని రోజుల నుంచి వీరి మధ్య తరచు చిన్న పాటి ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాజు, భార్య రేణుకతో కలిసి గోనుపాడు గ్రామ సమీపంలోని కసూర్బా పాఠశాల సమీపంలోని రైల్వే పట్టాల అనుకొని ఉన్న ఖాళీ స్థలంలోని ముళ్ల పొదాల్లో కట్టెలు కొట్టడానికి వెళ్లారు. ఈ సమయంలో ఇద్దరు ఘర్షణ పడి భార్య రేణుకను భర్త కత్తితో చెయ్యి భాగాన్ని, గొంతును కోసి హత్య చేసి పరారయ్యాడు. నిందితుడు హత్య చేసిన అనంతరం మహబుబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. 

నిందితుడి సమాచారంతో అక్కడి పోలీస్‌లు సాయంత్రం గద్వాల పోలీసులకు సమాచారం అందించడంతో గద్వాల పోలీసులు అప్రమత్తం అయ్యి సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో రేణుక మృతుదేహాన్ని గుర్తించి జిల్లా కేంద్రంలోని ఉన్న ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రేణుకకు ఇద్దరు అడపిల్లలు ఉన్నారు. అనంతరం పోలీసులు కేసు నమేదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, గద్వాల సీఐ జక్కుల హనుమంత్‌ సంఘటన వెళ్లి సంఘటనకు సంబంధించి పలు విషయాలపై పూర్తి స్థాయిలో ఆరా తీశారు.


logo
>>>>>>