మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 22:14:06

భార్య మృతి తట్టుకోలేక..

భార్య మృతి తట్టుకోలేక..

జయశంకర్ భూపాలపల్లి: వారు అప్పటిదాకా అన్యోన్యంగా జీవించారు. అయితే, భార్య అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమె చనిపోయిన అరగంటలోనే భర్త కూడా ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారక సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. 

మహాదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన ఐత మొండమ్మ (85), ఐత పోషిరెడ్డి (90) భార్యభర్తలు. కాగా, మొండమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. పరిస్థితి విషమించడంతో గురువారం కన్నుమూసింది. భార్య మృతిని తట్టుకోలేక అరగంట వ్యవధిలోనే పోషిరెడ్డి గుండెపోటుతో మృతిచెందాడు. ఇద్దరు ఒకేసారి మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo