గురువారం 02 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 01:21:59

నియంత్రిత సాగు వందశాతం సక్సెస్‌

నియంత్రిత సాగు వందశాతం సక్సెస్‌

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తేతెలంగాణ: సీఎం కేసీఆర్‌పై రైతులకు అపారమైన నమ్మ కం ఉన్నదని, ప్రభుత్వం సూచించిన మేరకు రైతులు నియంత్రిత సాగును వందశాతం విజయవంతం చేశారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం మొదలైందని, సంగారెడ్డి జిల్లాలో 116 వేదికలను 3 నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.750 కోట్లతో లక్ష కల్లాలను ప్రభుత్వం నిర్మించనున్నదని వెల్లడించారు. రైతులకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. సమావేశంలో ఎంపీలు బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, కలెక్టర్‌ హనుమంతరావు పాల్గొన్నారు. logo