సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:11:59

వచ్చేనెలలో హ్యూమన్‌ ట్రయల్స్‌ ఫలితాలు

వచ్చేనెలలో హ్యూమన్‌ ట్రయల్స్‌ ఫలితాలు

  • భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్లా వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నియంత్రణకు అభివృద్ధి చేసిన ‘కోవాగ్జిన్‌' వ్యాక్సిన్‌ మానవ ప్రయోగాల ఫలితాలు వచ్చేనెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) రాజస్థాన్‌శాఖ నిర్వహించిన వెబినార్‌లో భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్లా పాల్గొన్నారు. ఫేజ్‌-1లో టీకా సురక్షితమైనదని, సమర్థంగా పనిచేస్తున్నదని తేలిందని అన్నారు. త్వరలో ఫేజ్‌-2 ప్రయోగాలు ప్రారంభమవుతాయన్నారు. దేశవ్యాప్తంగా 12 కేంద్రాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ట్రయల్స్‌కు 375 మందిని ఎంపికచేశామని, ఇందులో సగం మందికిపైగా వ్యాక్సిన్‌ను ప్రయోగించామని పేర్కొన్నారు. ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ అందించడంలో భారత్‌ కీలక పాత్ర పోషించబోతున్నదని ఆమె విశ్వాసం వ్యక్తంచేశారు.


logo