ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 02:55:10

టీ న్యూస్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ విజయవంతం

టీ న్యూస్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ విజయవంతం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీ న్యూస్‌, అపెక్స్‌ ఎడ్యుకేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘తెలంగాణ గోల్డెన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌-2020’ విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లోని కమ్మసంఘం ప్రాంగణంలో 3రోజులపాటు ఈ ఫెయిర్‌ నిర్వహించారు. చివరిరోజైన ఆదివారం పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు ఫెయిర్‌కు హాజరై కాలేజీలు, గ్రూపుల సమాచారాన్ని తెలుసుకున్నారు. ఫెయిర్‌లో ఇంజినీరింగ్‌ సహా అన్ని కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఏర్పడే సందేహాలను విద్యార్థులు, తల్లిదండ్రులు మాక్‌ వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా నివృత్తి చేసుకున్నారు. ఫెయిర్‌ నిర్వహణ పట్ల కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తంచేశారు. కా లేజీలు, బ్రాంచ్‌ ఎంపిక విషయంలో విద్యార్థులకు విలువైన సూచనలు ఇచ్చినట్టు అధ్యాపకులు పేర్కొన్నారు. భవిష్యత్తుకు అవసరమైన సమాచారాన్ని అందించటంలో కృషి చేసిందని టీ న్యూస్‌ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఫెయిర్‌ను విజయవం తం చేసిన కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులకు టీ న్యూస్‌ సీజీఎం ఉపేందర్‌ కృతజ్ఞతలు తెలిపారు.  


logo