మంగళవారం 02 జూన్ 2020
Telangana - Feb 24, 2020 , 06:57:30

ప్రాపర్టీ ట్యాక్స్‌ గ్రీవెన్స్‌కు విశేష స్పందన: జీహెచ్ఎంసీ కమిషనర్

ప్రాపర్టీ ట్యాక్స్‌ గ్రీవెన్స్‌కు విశేష స్పందన: జీహెచ్ఎంసీ కమిషనర్

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్ లోని అన్ని సర్కిళ్లలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్‌ పరిష్కారం గ్రీవెన్స్‌కు మంచి స్పందన లభిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16, 23వ తేదీల్లో వచ్చిన 435 గ్రీవెన్స్‌ దరఖాస్తుల్లో 55 గ్రీవెన్స్‌ను పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన దరఖాస్తులను పరిష్కరించుటకు స్క్రూటీని చేసి క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


logo