శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 27, 2020 , 21:10:50

ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన

ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంలో భాగంగా అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు, భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో అనేక మంది ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం ఇదే చివరి అవకాశమని చెబుతుండడంతో అనధికార ప్లాట్లు కలిగిన ఉన్నవారంతా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేస్తున్నారు. ఇటీవల ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అనేక మందికి ఊరట లభించింది. రిజిస్ట్రేషన్‌ తేదీ నాటి మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకోవడంతో ముందు అనుకున్న దాని కంటే తక్కువ మొత్తంలోనే ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా లబ్ధిదారులు బల్దియా కార్యాలయంతో పాటు మీసేవా కేంద్రాలు, లైసెన్సు ఇంజినీర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. బల్దియా కార్యాలయంలో ప్రత్యేకంగా ఉచితంగా దరఖాస్తులు చేయడంతో పాటు సందేహాల నివృత్తి కోసం సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆదివారం నాటికి 5.15లక్షల వరకు దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.52.37 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం వచ్చిన 5.15లక్షల దరఖాస్తుల్లో పురపాలక సంఘాల్లో 2.9లక్షలు, గ్రామ పంచాయతీల్లో 1.94 లక్షలు, నగర పాలక సంస్థల్లో 1.10లక్షల దరఖాస్తులు వచ్చాయి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.