గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 17:52:39

రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ

రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ

ఆదిలాబాద్‌ : రెవెన్యూ చట్టానికి మద్దతుగా జిల్లా కేంద్రంలో సోమవారం ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు ర్యాలీగా తరలివచ్చారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, మాజీ ఎంపీ నగేశ్‌లు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లను నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. 

ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం చాందా సమీపం నుంచి ప్రారంభమైన  ర్యాలీ పట్టణంలోని తెలంగాణ చౌక్‌ వరకు నాలుగు కిలోమీటర్ల మేర సాగింది. 500 ట్రాక్టర్లు, 300 ఎడ్లబండ్లపై వచ్చిన రైతులు ఉత్సాహంగా ముందుకుసాగారు. తెలంగాణ చౌక్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌, మాజీ ఎంపీ, ఇతర నాయకులు, రైతులు క్షీరాభిషేకం చేశారు. 
logo