e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home తెలంగాణ భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
  • రూ.15.60 లక్షల మందుగుండు సామగ్రి సీజ్‌

ఖమ్మం రూరల్‌, మే 15: ఖమ్మం జిల్లాలో శనివారం పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం రూరల్‌ పీఎస్‌లో పోలీస్‌ కమిషనర్‌ విష్ణుఎస్‌వారియర్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఖమ్మం రూరల్‌ మండలంలోని వరంగల్‌ క్రాస్‌ రోడ్డు సమీపంలోని అఫ్జల్‌ మటన్‌ షాపు దగ్గర పేలుడు పదార్థాలను ఆటోలోంచి కారులోకి ఎక్కిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోడ్రైవర్‌ మాలప్రోలు ఉపేందర్‌, కారులో ఉన్న వ్యక్తులు సామిరెడ్డి పూర్ణచందర్‌రెడ్డి, మచ్చా రమేశ్‌ ఇచ్చిన సమాచారం మేరకు మండలంలోని పిట్టలవారిగూడెం సమీపంలో ఉన్న మామిడి తోటలో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన గోదాంపై దాడిచేశారు. 35 బ్యాగుల సల్ఫర్‌, 12 బ్యాగుల బ్లాక్‌పౌడర్‌, 15 బ్యాగుల మిక్స్‌డ్‌ గన్‌పౌడర్‌, 30 బ్యాగుల బూస్ట ర్స్‌, 5 బ్యాగుల జిలిటెన్స్‌ స్టిక్స్‌, 950 డిటోనేటర్స్‌తోపాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. వీటి విలువ రూ.15.60 లక్షలని చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ట్రెండింగ్‌

Advertisement