శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 09:26:42

పొలంలో భారీ కొండ చిలువ

పొలంలో భారీ కొండ చిలువ

హైదరాబాద్‌ :  వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో భారీ కొండ చిలువను రైతులు గుర్తించారు. ముళ్ల పొదల్లో చిక్కుకోగా రైతులు లక్ష్మన్న, శేఖర్‌ సాగర్‌ స్నేక్‌ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్‌కు సమాచారం అందించగా.. ఆయన గ్రామానికి చేరుకొని 11 ఫీట్ల పొడవు, 26 కిలోల బరువు ఉన్న కొండ చిలువను పొలం నుంచి రక్షించి, వైద్యశాలకు తరలించారు. కొండ చిలువకు గాయమైన ప్రదేశంలో ఐదు కుట్లు వేసినట్లు తెలిపారు. కొండ చిలువను సురక్షితమైన నల్లమల అటవీప్రాంతంలో వదిలివేయనున్నట్లు కృష్ణసాగర్‌ తెలిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.