శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 01:12:25

టీఆర్‌ఎస్‌లోకి విపక్ష ఎంపీటీసీ సభ్యులు

టీఆర్‌ఎస్‌లోకి విపక్ష ఎంపీటీసీ సభ్యులు

-ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకు మద్దతుగా..

భీమ్‌గల్‌: నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు మద్దతు తెలుపుతూ నిజామాబాద్‌ జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు, స్వతంత్రులు బుధవారం  టీఆర్‌ఎస్‌లో చేరారు. భీమ్‌గల్‌ మండలానికి చెందిన ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. బీజేపీకి చెందిన సికింద్రాపూర్‌ ఎంపీటీసీ గరిపల్లి లక్ష్మి గజేందర్‌గౌడ్‌, కాంగ్రెస్‌కు చెందిన మెండోరా ఎంపీటీసీ ఆరె రవీందర్‌, దేవక్కపేట్‌ ఎంపీటీసీ గోవింద్‌తోపాటు ఎంపీటీసీ సభ్యులు సుర్జీల్‌, రాజేశ్వర్‌, గుల్ల్లె నర్సయ్య వేల్పూర్‌లోని మంత్రి నివాసంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

గులాబీ గూటికి జక్రాన్‌పల్లి ఎంపీటీసీ-2

జక్రాన్‌పల్లి ఎంపీటీసీ-2 స్వతంత్ర సభ్యురాలు తలారి మరియా, ఆమె భర్త సతీశ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఇందల్వాయి మండలం మెగ్యానాయక్‌ తండా ఎంపీటీసీ సభ్యులు లకావత్‌ లలితా సంతోష్‌(కాంగ్రెస్‌) టీఆర్‌ఎస్‌లో చేరారు.


logo