బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 21:00:02

పల్లెల ప్రగతికి సరిపోయేలా నిధుల కేటాయింపు..

పల్లెల ప్రగతికి సరిపోయేలా నిధుల కేటాయింపు..

సూర్యాపేట: రాష్ట్రప్రభుత్వం పల్లెల ప్రగతికి సరిపోయేలా నిధులు కేటాయించేందుకు సిద్దంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు విధులు సకాలంలో నిర్వహించేందుకు సన్నద్దంగా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి నిర్దేశించారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం లక్ష్మణ్ నాయక్ తండా నుండి చాంపు లాల్ తండా వరకు 90 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన రహదారి నిర్మాణ పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. లక్ష్మీ తండా గ్రామపంచాయతీకి పారిశుధ్య పనులతోపాటు హరితహారం నిర్వహించేందుకుగాను కొనుగోలు చేసిన ట్రాక్టర్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..మార్చి 31నాటికి సీసీ రోడ్ల పనుల నిర్మాణాలు పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు. మొదటి విడతగా సూర్యాపేట శాసనసభ నియోజకవర్గానికి ఎన్డీఎస్, ఎన్ఆర్ఈజియస్ కింద రూ.15.50 కోట్ల నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇకపై 57 ఏండ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆసరా ఫించన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. . ఇక నుంచి వ్యవసాయానికి సమృద్ధిగా సాగు నీరు అందుబాటులో ఉంటుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కలలో కూడా ఊహించని గోదావరి జలాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో నిర్మించిన కాళేశ్వరం నుండి సూర్యాపేట కు పరుగులు పెడుతుంది నిజం కాదా అని ఆయన మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. logo
>>>>>>