మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద వస్తున్నది. ఎగువన భారీ వర్షాలతో జలాశయంలోకి 3,86,000 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 44 గేట్లు ఎత్తి 4,02,463 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. ప్రాజెక్టులో ప్రస్తుతం 316.550 మీటర్ల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.01 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.