బుధవారం 03 జూన్ 2020
Telangana - May 05, 2020 , 00:37:51

ఆరు రోజుల్లో 4412 యూనిట్లు

 ఆరు రోజుల్లో 4412 యూనిట్లు

  • మంత్రి కేటీఆర్‌ స్ఫూర్తితో భారీగా రక్తదానాలు

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు ఎంతోమందికి ప్రాణాధారంగా మారింది. గతనెల టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపారు. దాంతో ఎంతోమంది రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. కేవలం ఆరు రోజుల్లో  4,412 యూనిట్ల రక్తం సేకరించారు. మంత్రి కేటీఆర్‌ పిలుపుతో ఏప్రిల్‌ 27న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 657 యూనిట్ల రక్తాన్ని వైద్య విభాగాలు సేకరించాయి. ఆరోజు నుంచి మే 2వ తేది వరకు దాతల ద్వారా 4412 యూనిట్ల రక్తం సేకరించగా  అందులో 2518 యూనిట్ల రక్తాన్ని అవసరమైన వారికి పంపిణీ చేశారు. logo