శనివారం 04 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 20:18:02

కర్నల్‌ సంతోష్‌బాబుకు నివాళులర్పించిన హెచ్‌ఆర్సీ చైర్మన్‌

కర్నల్‌ సంతోష్‌బాబుకు నివాళులర్పించిన హెచ్‌ఆర్సీ చైర్మన్‌

సూర్యాపేట : కర్నల్‌ సంతోష్‌బాబుకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ గుండా చంద్రయ్య నివాళులర్పించారు. బుధవారం సూర్యపేటలోని ఆయన ఇంటికి వెళ్లి, చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత కర్నల్‌ సంతోష్‌బాబును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎంతో భవిషత్ ఉన్న ఆయన సరిహద్దులో అమరుడు కావడం బాధాకరమన్నారు. ఓ కుటుంబంలోని వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి మాత్రమే నష్టమని.. ఓ సైనికుడు మరణిస్తే దేశానికి ఎంతో నష్టమని అన్నారు. ఈ సందర్భంగా కర్నల్‌ కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి ప్రకటించారు. కుటుంబానికి సహాయం, మనోధైర్యం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు ఇర్ఫాన్‌, మొయినొద్దీన్‌ తదితరులు ఉన్నారు. 


logo