బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 16:45:36

పోలీసులకు హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థులు మాస్క్‌లు అంద‌జేత‌

పోలీసులకు హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థులు మాస్క్‌లు అంద‌జేత‌

హైద‌రాబాద్ : క‌రోనా నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో విధులు నిర్వ‌ర్తిస్తున్న పోలీసులు స‌హాయార్థం హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు మాస్క్‌ల‌ను విరాళంగా అంద‌జేశారు. హెచ్‌పీఎస్ అల్యుమెని విద్యార్థులు సైబరాబాద్ పోలీసులకు ఎన్ 95 మాస్క్‌లు, 3 ప్లై సర్జికల్ మాస్క్‌లను విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట పూర్వ విద్యార్థుల విద్యార్థులు పిఎన్ అభిజీత్ రెడ్డి, అల్లం సుమంత్, డి. అఖిల్ కుమార్‌, ఆకాశ్ మ‌ల్లాకార్జున్ ఎడిసిపి ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో‌ సైబరాబాద్ పోలీసు కమిషనర్ స‌జ్జ‌నార్‌కు 150 ఎన్ 95 మాస్క్‌లు అదేవిధంగా వెయ్యి 3 ప్లై సర్జికల్ మాస్క్‌లను అంద‌జేశారు.

హెచ్‌పీఎస్‌ పూర్వ విద్యార్థుల ఔద‌ర్యాన్ని సీపీ స‌జ్జ‌నార్ ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించారు. ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వ‌హిస్తున్న‌ అధికారులకు వీటిని పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూ కోవిడ్‌-19 సంక్రమణ వ్యాప్తి చెందకుండా చూద్దామ‌ని సీపీ ప్ర‌జ‌ల‌ను కోరారు. 


logo