శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 21, 2020 , 10:38:39

వరంగల్‌ జిల్లాలో హెచ్‌పీ గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా

వరంగల్‌ జిల్లాలో హెచ్‌పీ గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా

వరంగల్‌ అర్బన్‌ : జిల్లాలోని కమలాపూర్‌ మండలం గూడూరు శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన గ్యాస్‌ ట్యాంకర్‌.. కారును తప్పించబోయి బోల్తా పడింది. రోడ్డు పక్కనే వ్యవసాయ భూమిలో వాహనం బోల్తా పడడంతో పెను ప్రమాదం తప్పింది. తమిళనాడు నుంచి కమలాపూర్‌ హెచ్‌పీ గ్యాస్‌ ప్లాంట్‌కు ట్యాంకర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

హుజురాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకర్‌ నుంచి స్వల్పంగా గ్యాస్‌ లీక్‌ అవుతున్నట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించింది. ట్యాంకర్‌ బోల్తా పడిన మార్గంలో పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.logo