గురువారం 09 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 13:45:30

ఆలయాల్లో తీర్థ ప్రసాదాలు ఎలా తీసుకోవాలి

ఆలయాల్లో తీర్థ ప్రసాదాలు ఎలా తీసుకోవాలి

హైదరాబద్ : లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఆలయాలను తిరిగి తెరుస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకునే విషయాల్లో భక్తులు పాటించాల్సిన నియమ నిబంధనలను చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర రాజన్ తెలియజేశారు. 

కేంద్ర ప్రభుత్వం స్టేట్ స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొటోకాల్ ప్రకారం తీర్థం, ప్రసాదం ఇవ్వకూడదని చెప్పింది. అయితే భక్తుల కోరిక మేరకు తీర్థ ప్రసాదాలు జాగ్రత్తగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రసాదాలు చేతులకు తగలకుండా అందజేయ వచ్చన్నారు. దీనిని గమనించి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సవరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చిలుకూరు ఆలయాన్ని ఇప్పుడే తెరువబోమని ఎప్పుడనే విషయం త్వరలోనే తెలియజేస్తామన్నారు. అప్పటి వరకు భక్తులు రావొద్దని సూచించారు.logo