శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 30, 2020 , 03:20:46

ఆరింటితో హ్యాకర్లకు చెక్‌

ఆరింటితో హ్యాకర్లకు చెక్‌

 • సైబర్‌నేరగాళ్ల నుంచి రక్షించుకోవాలి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మీరు ఇంటర్నెట్‌, ఆన్‌లైన్‌.. మొబైల్‌ బ్యాంకింగ్‌ వాడుతున్నా రా? అయితే మీ సమాచారాన్ని భద్రంగా ఉంచుకోండి. జాగ్రత్తలు పాటించడం ద్వారా హ్యాకర్లు, సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలని సైబ ర్‌ క్రైం నిపుణులు, పోలీసులు చెప్తున్నారు. తాము సూచించే ఆరు సూత్రాలు పాటించాలంటున్నారు.  

 • టూ వే ఫైర్‌వాల్‌ (హ్యాక్‌ కాకుండా) వాడాలి.
 • అనవసరమైన లింకులు ఓపెన్‌ చేయవద్దు. 
 • సోషల్‌ మీడియాలో వ్యక్తిగత వివరాలివ్వద్దు
 • సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను అప్‌డేట్‌ చేయాలి
 • ఖాతాలు, కార్డులనంబర్లు, పాస్‌వర్డ్స్‌ ఇవ్వద్దు. 
 • పరిచయం లేని వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపితే గుడ్డిగా అంగీకరించవద్దు.

హ్యాకర్లు నుంచి ముప్పు ఇలా..

 • యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లను హైజాక్‌ చేస్తారు. 
 • బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు కాజేస్తారు. 
 • మీ వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో దొంగిలించి ఇతరులకు   అమ్ముకుంటారు. వారి త ప్పుడు పనుల్లో మీ వివరాలు పెట్టేలా చేస్తారు. 
 • మీ వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరవడంతోపాటు ఇతర అక్రమ పనుల్లో వాడుకుంటారు.


logo