శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 22:19:35

సాయిధరమ్ తేజ్ ఎంత మారిపోయాడో.. కథల్లో వైవిధ్యం..

సాయిధరమ్ తేజ్ ఎంత మారిపోయాడో.. కథల్లో వైవిధ్యం..

హైదరాబాద్‌ :  సాయిధరమ్ తేజ్ అంటే ఒకప్పుడు మూస సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవాడు. మొదట్లో పిల్లా నువ్వు లేని జీవితం సుప్రీమ్ సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి వరుస విజయాలు సాధించి.. ఆ తర్వాత రొటీన్ కథలను ఎంచుకొని  వరసగా అరడజను ఫ్లాపులు ఇచ్చాడు మెగా మేనల్లుడు. అసలు సాయి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కూడా పట్టించుకోవడం మానేశారు. ఆ సమయంలోనే ఇంటలిజెంట్, తిక్క, నక్షత్రం, విన్నర్ లాంటి తలతోక లేని సినిమాలు చేశాడు. ఈయనకు ఉన్న మాస్ ఇమేజ్ వాడుకోవడానికి కొందరు దర్శకులు చుట్టూ చేరి పిచ్చి సినిమాలు చేశారు. కెరీర్ మరీ డైలమాలో పడిపోతున్న సమయంలో కళ్ళు తెరిచాడు ఈ మెగా మేనల్లుడు. 

2019లో  ఈయన నటించిన చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలు విజయం సాధించాయి. రొటీన్‌గా కాకుండా కాస్త వైవిధ్యంగా ఉండే కథల వైపు అడుగులు వేస్తున్నాడు సాయి ధరమ్ తేజ. ఈ క్రమంలోనే ప్రస్తుతం కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో  సోలో బ్రతుకే సో బెటరూ సినిమా చేశాడు. డిసెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు విలక్షణ సినిమాల దర్శకుడు దేవకట్టా దర్శకత్వంలో ఒక పొలిటికల్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. దాంతో పాటు తాజాగా ఒక పిరియాడిక్ సినిమా ఒప్పుకున్నాడు సాయి ధరమ్ తేజ్. 

నిర్మాత భోగవిల్లి ప్రసాద్ నిర్మించే ఈ సినిమాకు దర్శకుడు సుకమార్ రైటింగ్స్ బ్యానర్ మంచి స్క్రిప్టు వస్తుంది. సుకుమార్ శిష్యుడు ఈ చిత్రానికి దర్శకుడు.1970 నేపథ్యంలో ఈ సినిమా కథ జరుగుతుందని తెలుస్తోంది.1970 బ్యాక్ డ్రాప్, ఆనాటి కాలమాన పరిస్థితులు సినిమాలో ప్రతిబింబిస్తాయని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. దాంతో పాటు వీరూ పోట్ల దర్శకత్వంలో కూడా ఒక పీరియాడికల్ డ్రామా చేయడానికి సాయి ధరమ్ తేజ్ ఓకే చెప్పాడు. ఒకప్పుడు మూస కథలు చేస్తాడని విమర్శలు తెచ్చుకున్న మెగా మేనల్లుడు ఇప్పుడు వైవిధ్యమైన కథను పెంచుకుంటూ తన కెరీర్ కి పూల బాటలు వేసుకుంటున్నాడు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.