బక్కాయనపై ఇంత మంది బాహుబలులా?

ఢిల్లీలో రైతులకు సమాధానం చెప్పలేకనే.. మోదీ సర్కారు హైదరాబాద్ బాట పట్టింది
సీపీఐ నేత కే నారాయణ మండిపాటు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాజకీయ ప్రయోజనాల కోసం అనైతిక విన్యాసాలతో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బరితెగించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. ఒక బక్కాయన ( కేసీఆర్)పై పోరాటానికి ఇంతమంది కాషాయ బాహుబలు (బీజేపీ జాతీయ నేతలు)లా వచ్చేది అని ఎద్దేవా చేశారు. ఇక్కడ జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలలా లేవని.. అసెంబ్లీ ఎన్నికల్లాగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. చూడటానికి హైదరాబాద్ స్థానిక ఎన్నికలే అయినా.. దేశవ్యాప్త ఎజెండాగా లౌకిక శక్తులు పునరాలోచించుకొనే తరుణం ఆసన్నమైందని నారాయణ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మతోన్మాద శక్తులను ఓడించాలని ఆదివారం ఓ వీడియో సందేశంలో నారాయణ పిలుపునిచ్చారు.
ఢిల్లీలో సమాధానం చెప్పలేక
కోట్లమంది రైతులు, కార్మికులు ఢిల్లీని ముట్టడిస్తే సమాధానం చెప్పలేని మోదీ సర్కారు.. హైదరాబాద్ బాట పట్టారని నారాయణ విమర్శించారు. ‘నిన్న కోడ్ సెంటిమెంట్, ఈరోజు మతం సెంట్మెంట్లను వాడుకొంటూ అనైతిక రాజకీయ విన్యాసాలతో మోదీ, అమిత్‌షాలు బరితెగించారంటే లౌకిక నీతి సూత్రాలను వెక్కిరించినట్టే కదా? ఒకవైపు కోట్ల మంది రైతులు అగ్గిపై నిలబడి ప్రాణాలకు బరితెగించి బారికేడ్లను, కరోనా మహమ్మారిని లెక్క చేయకుండా దేశ రాజధాని ఢిల్లీ చేరారు. వారికి సమాధానం చెప్పలేని మోదీ ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తూ హైదరాబాద్‌కు రాజకీయ వలస బాట పట్టింది. ఢిల్లీలో పారేసుకున్న సూదిని హైదరాబాద్‌లో వెతుక్కుంటున్న బీజేపీకి హైదరాబాద్ ఓటర్లు తగిన గుణ పాఠం చెప్పాలి’ అని పిలుపునిచ్చారు.
మతోన్మాదులంతా ఒక్కటే
మతోన్మాదులు ఏ పక్షంలో ఉన్నా ప్రమాదకారులేనని నారాయణ అన్నారు. ‘కావాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసుకోండి’ అని ఓటర్లకు ఎంఐఎం చెప్పటమే కాషాయ పార్టీకి ఇంతటి అవకాశం రావడానికి కారణమ’ని విమర్శించారు.
తాజావార్తలు
- అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ప్రమాణ స్వీకారం
- అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం
- ఆ నలుగురు కరోనా టీకా వల్ల చనిపోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ
- అమెరికాలో సరికొత్త రోజు : జో బైడెన్
- స్పెయిన్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
- దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్‌ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత