సోమవారం 01 జూన్ 2020
Telangana - May 18, 2020 , 00:19:34

పైసా ఖర్చులేకుండా పేదలకు ఇండ్లు

పైసా ఖర్చులేకుండా పేదలకు ఇండ్లు

  • ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట, నమస్తేతెలంగాణ: నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందనీ, దేశంలో ఎక్కడా లేనివిధంగా లబ్ధిదారులకు పైసా ఖర్చులేకుండా అన్ని హంగులతో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి తాళం చెవి అందిస్తున్నామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట రూరల్‌ మండలంలోని తోర్నాల, రావురూకుల గ్రామాల్లో 48 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు గృహప్రవేశాలు చేయించి లబ్ధిదారులకు అప్పగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇన్నాళ్లు కిరాయి ఇంట్ల, గుడిసెల్లో నివసించిన పేదలు ఇప్పుడు ఆత్మగౌరవంతో జీవిస్తారన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ఇండ్లు నిర్మించి ఇస్తామని, దశల వారీగా అందరికీ ఇండ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 


logo