సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 07:07:59

అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వలేదని.. ఇంటి యజమానురాలు నిర్బంధం

అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వలేదని.. ఇంటి యజమానురాలు నిర్బంధం

హైదరాబాద్  : అద్దె ఇంటిని ఖాళీచేసినా.. అడ్వాన్స్‌ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో.. ఇంటి యజమానురాలిని గదిలో నిర్బంధించాడు. ఈ సంఘటన నగరంలోని నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది.  ఎస్సై నవీన్‌ కుమార్‌  కథనం ప్రకారం.. హిమాయత్‌నగర్‌లో లక్ష్మి అనే మహిళ ఇంట్లో  మహేందర్‌ అగర్వాల్‌ అద్దెకు  ఉంటున్నాడు. కాగా.. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య తరచూ గొడువలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇంటి యజమానురాలు... ఇంటిని ఖాళీ చేయాలని మహేందర్‌ అగర్వాల్‌కు చెప్పింది. దీంతో అతను సోమవారం ఖాళీ చేశాడు. అయితే ఇంట్లోకి వచ్చే ముందు చెల్లించిన రూ.30 వేలు అడ్వా న్స్‌ డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరాడు. ప్రస్తుతం తన వద్ద అంత డబ్బులేదు.. తరువాత ఇస్తానని లక్ష్మి చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య  వాగ్వావాదం జరిగింది. కోపంతో మహేంద ఖాళీగా ఉన్న గదిలోకి లక్ష్మిని నెట్టేసి..  ఇంటికి తాళం వేసి పరారైయ్యాడు. భయాందోళనతో బాధితురాలు లక్ష్మి  డయల్‌ -100కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చింది. నారాయణగూడ పోలీసులు తాళం పగులగొట్టి.. లక్ష్మిని బయటకు తీసుకువచ్చారు. బాధితురాలి ఫిర్యాదుతో మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 


logo