శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 17:59:17

హాస్టల్స్‌ను తెరిచే ఉంచుతున్నాం... బంద్‌ చేస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు

హాస్టల్స్‌ను తెరిచే ఉంచుతున్నాం... బంద్‌ చేస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హాస్టల్స్‌ను బంద్‌ చేస్తున్నట్లుగా తాము ఎక్కడా చెప్పలేదని సైబరాబాద్‌ వసతిగృహాల అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. సైబరాబాద్‌ వసతిగృహాల అసోసియేషన్‌ ప్రతినిధులు నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... హాస్టల్స్‌ బంద్‌ చేస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదన్నారు. బలవంతంగా వసతిగృహాలను ఖాళీ చేయించడం లేదన్నారు. ఎవరూ అసత్య ప్రచారాలు నమ్మొద్దొని కోరారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ వసతిగృహాలను తెరిచే ఉంచుతున్నట్లు తెలిపారు.

హాస్టల్స్‌లో ఉండేవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సైబరాబాద్‌ ఐటీ జోన్‌లో 500కి పైగా హాస్టల్స్‌ ఉన్నాయన్నారు. ఇందులో ఎక్కువమంది ఐటీ ఉద్యోగులే ఉంటారన్నారు. సుమారు 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువమంది హాస్టల్స్‌ నుంచే పనిచేస్తున్నారన్నారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. హాస్టల్స్‌లో ఉంటున్న వారి తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దన్నారు. తాము వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు పేర్కొన్నారు.logo