బుధవారం 03 జూన్ 2020
Telangana - May 21, 2020 , 15:29:30

సేవలకు సన్మానం

సేవలకు సన్మానం

యాదాద్రి భువనగిరి: ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానలకు వెళ్లాలంటే జనం భయపడేవారు. అప్పు చేసైనా సరే చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకునేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట ప్రభుత్వం సర్కార్ దవాఖానల్లో సకల వసతులు కల్పిస్తుండడంతో వైద్యం కోసం ప్రభుత్వ దవాఖానకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

తా జాగా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క మే నెలలోనే 10 కాన్పులు చేశారు అక్కడి వైద్య సిబ్బంది. అందుకు గాను వారి సేవలను గుర్తించి స్టాఫ్ నర్సులు సిలవా , సుజాత, ఆయా వర్కర్లు కృష్ణవేణి, లలితను మోత్కూర్ మున్సిపాలిటీ 10 వార్డ్ కౌన్సిలర్ బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి వారిని సన్మానించారు. కార్యక్రమంలో దవాఖాన సిబ్బంది, ఫార్మాసిస్ట్ చింతల సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


logo