గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 30, 2020 , 13:32:24

మామిడి తోటలో తేనేటీగల దాడి.. వ్యక్తి మృతి

మామిడి తోటలో తేనేటీగల దాడి.. వ్యక్తి మృతి

వనపర్తి : శ్రీరంగాపురం మండలం తాటిపాముల వద్ద విషాదం నెలకొంది. అక్కడున్న మామిడి తోటలో ఓ వ్యక్తి మామిడికాయలు తెంపుతుండగా.. అతనిపై తేనేటీగలు దాడి చేశాయి. తేనేటీగల దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడున్న బావిలో పడి చనిపోయాడు. మృతుడిని పెబ్బేరుకు చెందిన గోనెల నరసింహా(45)గా పోలీసులు గుర్తించారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్‌

కామారెడ్డి : జిల్లాలోని బీర్కూర్‌ మండలం దామరంచ వద్ద రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ట్రాక్టర్‌ అదుపుతప్పి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు.logo