శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 01, 2020 , 01:35:30

నిర్బంధం నుంచి బయటికి రావొద్దు

నిర్బంధం నుంచి బయటికి రావొద్దు

  • నిబంధనలు ఉల్లంఘిస్తే పాస్‌పోర్టు రద్దు
  • నిత్యం పారిశుద్ధ్య కార్యక్రమాలు 
  • సిరిసిల్ల అధికారులకు కేటీఆర్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గృహ నిర్బంధంలో ఉన్నవాళ్లు బయటికిరాకుండా చూడాలని, ఏడో తేదీవరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌ హెగ్డే, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌తో ఆయన ఫోన్‌లో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో కరోనావైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు పలు సూచనలు చేశారు. జిల్లాలో స్వీయనిర్బంధంలో ఉన్న 1,032 మంది నిబంధనలను ఉల్లంఘిస్తే పాస్‌పోర్టులను రద్దుచేయాలని ఆదేశించారు. 

ఇటుకబట్టీలు, నిర్మాణరంగం, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వలస కార్మికులకు వసతి, భోజన, వైద్యసౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న 141 హార్వేస్టర్ల (వరికోత యంత్రాలు)తో పాటు మరిన్ని ఇతర ప్రాంతాల నుంచి  తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని కోరారు. గ్రామాల్లో 215 కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. అన్ని గ్రామాల్లో సోడియం హైపోక్లోరేట్‌ను పిచికారి చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆదేశించారు. నిత్యావసరాలను నిల్వచేసి ఎక్కువ ధరలకు విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


logo