ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 21:06:08

అబ్దుల్ కలాం అవార్డులు అందజేసిన హోంమంత్రి

అబ్దుల్ కలాం అవార్డులు అందజేసిన హోంమంత్రి

హైదరాబాద్‌ : డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 89వ  జయంతి సందర్భంగా ఎక్స్ లెన్స్ అవార్డుల బహూకరణ కార్యక్రమం జరిగింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమ్మద్ అలీ గురువారం అందజేశారు. హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హోం మంత్రి మాట్లాడారు. సమాజంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి డాక్టర్ అబ్దుల్ కలాం ఎక్స్‌లెన్సీ అవార్డులను అందజేయడం హర్షించదగిన విషయమన్నారు. భారతరత్న అబ్దుల్ కలాం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అని, తన జీవితాన్ని దేశ సేవ కోసం అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. సాధారణ ఉద్యోగి స్థాయి నుంచి భారత రాష్ట్రపతి వరకు ఎదిగి భారతరత్న అవార్డు అందుకోవడం గొప్ప విషయమని తెలిపారు. డాక్టర్ అబ్దుల్ కలాం తన రచనల ద్వారా ఎంతోమందికి ప్రేరణ కలిగించారని, ఆయన జయంతి సందర్భంగా అవార్డులు అందజేయాలని మెగా సిటీ నవకళావేదిక నిర్ణయించడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జే రాజేష్ నేత, అపోలో దవాఖాన ఎండోక్రైనాలజిస్ట్‌ డాక్టర్ ఆశిష్ చౌహాన్, కే శ్రీనివాసాచారి, నవ కళావేదిక అధ్యక్షుడు ఏ మల్లికార్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo