శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 01:37:17

ప్రాణాన్ని నిలబెట్టే ప్లాస్మా దానం

ప్రాణాన్ని నిలబెట్టే ప్లాస్మా దానం

  • దాతలకు సన్మానంలో హోంమంత్రి మహమూద్‌అలీ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అపోహలను తొలగించుకుని ధైర్యంగా ముందుకొచ్చిన ప్లాస్మాదాతల స్ఫూర్తి అభినందనీయమని హోంమంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు. ప్లాస్మాదానం ఇతరుల ప్రాణాలను కాపాడుతుందని చెప్పారు. కరోనా నివారణ కోసం దాతలు ప్లాస్మాదానం చేసేందుకు నిరంతరం కృషిచేస్తున్న కొవిడ్‌ కంట్రోల్‌ సిబ్బందికి గురువారం సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో మహమూద్‌అలీ రివార్డులను అందించారు. ప్లాస్మాదానం చేసిన యోధులకు ప్రశంసపత్రాలను అందజేసి సన్మానించారు. సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. ఇప్పటివవరకు 760 మంది ప్లాస్మాదానం చేసి 1300 మందికి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించారని తెలిపారు. 


logo