గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:31:21

విమర్శలు అర్థరహితం

విమర్శలు అర్థరహితం

  • ఏ అంశం లేకనే మసీదు, మందిరం విషయంలో విపక్షాల రాద్ధాంతం: హోంమంత్రి మహమూద్‌ అలీ ధ్వజం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాత సచివాలయం కూల్చివేత విషయంలో ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితంగా ఉన్నాయని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ మండిపడ్డారు. నూతన సచివాలయ నిర్మాణంలో భాగంగా మసీదు, మందిరాలను పూర్తి హంగులతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంగా ప్రకటించారని గుర్తుచేశారు. అయినా కూడా ప్రతిపక్ష నాయకులు కొందరు ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. నూతనంగా నిర్మించే దేవాలయంలో పూజలు, మసీదులో ప్రార్థనలు  జరిపాకే కొత్త సచివాలయ భవన ప్రారంభోత్సవం చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏ అంశం లేనందునే ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. అందుకే ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రజల్లో అనవసర గందగోళం సృష్టించవద్దని ఆయన హితవు పలికారు.


logo