శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:57:42

టాఫిక్‌ పోలీసులకు 30% అలవెన్స్‌

టాఫిక్‌ పోలీసులకు 30% అలవెన్స్‌

  • హోంమంత్రి మహమూద్‌అలీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆరోగ్యం పాడవుతున్నా, కాలుష్యాన్ని ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులకు అలవెన్స్‌లు అందిస్తున్నామని హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యుల ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. రాష్ట్రంలో 4,952 మంది ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నారని వెల్లడించారు. వారికి కాలుష్య అలవెన్స్‌ కింద బేసిక్‌ జీతంపై 30% అదనంగా చెల్లిస్తున్నామన్నారు. మరోవైపు, వరంగల్‌ జోన్‌, ఖమ్మం జిల్లాకు చెందిన 1990 బ్యాచ్‌ కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలని జీరో అవర్‌లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వాన్ని కోరారు. 


logo