గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 02:34:53

మొయినాబాద్‌ ఘటనపై సీరియస్‌

మొయినాబాద్‌ ఘటనపై సీరియస్‌

  • విచారణను వేగవంతం చేయాలని 
  • హోంమంత్రి మహమూద్‌ అలీ ఆదేశం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మహిళలు, బాలికలకు సంబంధించిన కేసుల్లో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉన్నదని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మొయినాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇటీవల జరిగిన ఓ యువతి అనుమానాస్పద మృతి కేసుపై సమగ్ర దర్యాప్తు జరుపాలని పోలీసులను ఆదేశించారు. నిందితుడిపై పీడీ యాక్ట్‌ విధించడంతోపాటు వేగంగా విచారణ చేపట్టాలని చెప్పారు. మంగళవారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌ చక్రవర్తితో మహమూద్‌అలీ సమీక్షించారు. ఘటన విచారణాధికారిగా అశోక్‌ చక్రవర్తిని నియమించినట్టు ప్రకటించారు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ ప్రకారం నిర్భయ, బాలకార్మికుల చట్టం కింద అభియోగాలు నమోదుచేశామని పోలీసులు.. హోంమంత్రికి వివరించారు. నిందితుడు మధుయాదవ్‌ను అరెస్టుచేసి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించామని చెప్పారు. ఇటీవల మధుయాదవ్‌ గదిలోనే యువతి ఉరి వేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులకు పాల్పడి యువతిని మధుయాదవ్‌ హత్యచేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె సోదరి ఫిర్యాదు మేరకు నిర్భయ కేసు నమోదుచేశారు. logo