ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 18:33:48

పోలీసు సిబ్బందిని ప్రశంసించిన హోంమంత్రి మహమూద్ అలీ

పోలీసు సిబ్బందిని ప్రశంసించిన హోంమంత్రి మహమూద్ అలీ

హైద‌రాబాద్ : గ‌త‌ మూడు రోజులుగా వర్షంలో  తడుస్తున్న ఒక వ్యక్తిని కాపాడి స‌ప‌ర్య‌లు చేసి చికిత్స నిమిత్తం త‌ర‌లించిన పోలీసు సిబ్బందిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ  ప్రశంసించారు. న‌గ‌రంలోని  చాంద్రాయణగుట్ట  పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా వర్షంలో తడుస్తూ ఒక దుకాణం వద్ద పడిపోయిన వ్యక్తిని పోలీసులు గ‌మ‌నించారు. ఆ వ్యక్తి  తన వివరాలను ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు. బీ మహేష్ అనే కానిస్టేబుల్, ఎండి సయీద్ అనే  హోం గార్డ్ ఇద్దరు ఆ వ్యక్తిని 108 వాహనం ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

తన పేరు శేఖర్ గా బాధితుడు తెలిపాడు అంత‌కు మించి వివ‌రాలేమి చెప్ప‌లేక‌పోయాడు. భారీ వర్షాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా మాన‌వ‌త‌తో స్పందించి ఓ వ్య‌క్తిని కాపాడ‌టంపై హోంమంత్రి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. స‌ద‌రు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. పోలీసు సిబ్బంది శాంతిభద్రతలను కాపాడడంతో పాటు సేవ చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకుంటున్నారని ప్రశంసించారు.


logo