శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 17, 2020 , 02:06:06

పోలీస్‌ సిబ్బందిని అభినందించిన హోంమంత్రి

పోలీస్‌ సిబ్బందిని అభినందించిన హోంమంత్రి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మూడు రోజులుగా వర్షంలో తడుస్తూ అనారోగ్యంపాలైన ఓ వ్యక్తిని కాపాడిన చాంద్రాయణగుట్ట పోలీసులను హోంమంత్రి మహమూద్‌ఆలీ అభినందించారు. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ దుకాణం వద్ద తలదాచుకున్న గుర్తుతెలియని వృద్ధుడు మూడురోజులుగా వర్షంలో తడుస్తూ తీవ్రఅస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో స్పందించిన పెట్రోలింగ్‌ సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉన్న వ్యక్తికి సపర్యలు చేసి దవాఖానకు తరలించి మానవత్వం చాటుకొన్నారు. వారిని హోంమంత్రి మహమూద్‌ఆలీ అభినందిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 


logo