శుక్రవారం 03 జూలై 2020
Telangana - Mar 28, 2020 , 22:30:34

కరోనా కట్టడికి ఆలయాల్లో హోమాలు

కరోనా కట్టడికి ఆలయాల్లో హోమాలు

హైదరాబాద్ : కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడి ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుతూ రాష్ట్రంలోని పలు ప్రధాన దేవాలయాల్లో శనివారం హోమాలు నిర్వహించారు. సికింద్రాబాద్‌ గణపతి దేవాలయంలో ధన్వంతరి, మహా మృత్యుంజయ హోమం జరిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, భద్రాచలం శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయం, ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవాలయం, జోగుళాంబ ఆలయం, ఏడుపాయల దుర్గాభవానీ ఆలయం, వరంగల్‌ భద్రకాళి దేవాలయం, తాడుబందు వీరాంజనేయస్వామి, నాచారం లక్ష్మీనరసింహాస్వామి ఆలయం, చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వర, ముక్తేశ్వరస్వామి దేవాలయం, అమీర్‌పేట కనకదుర్గ దేవాలయంలో మృత్యుంజయ హోమాలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.logo