సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 20:17:01

టీఆర్ఎస్‌కు హెచ్ఎంఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు

టీఆర్ఎస్‌కు హెచ్ఎంఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు

హైద‌రాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి హెచ్.ఎం.ఎస్. కార్మిక సంఘం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీకి రైల్వే ఉద్యోగులు, కార్మికులు అండగా నిలవాలని హెచ్.ఎం.ఎస్., రైల్వే మజ్దూర్ యూనియన్ జాతీయ ఉప కార్యదర్శి, ఐదు రాష్ట్రాల ఇంచార్జీ శంకర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రైల్వే కార్మిక సంఘం జాతీయ కీలక నాయకులు శంకర్ రావుతో బుధవారం సికింద్రాబాద్ లోని ఆయన నివాసంలో భేటి అయ్యారు. రైల్వేలో కీలక పాత్రను పోషిస్తున్న మజ్దూర్ యూనియన్, టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్న విషయాన్ని రైల్వే ఉద్యోగులు, కార్మికులకు అందజేయనుంది. టీఆర్ఎస్‌కు మద్దతును ఇవ్వడం పట్ల వినోద్ కుమార్.. శంకర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీలో ఎంపీ బండ ప్రకాష్, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు యాదవ రెడ్డి పాల్గొన్నారు.