రైల్వే ఉద్యోగుల వైద్యసేవలకు హెచ్ఎంఐఎస్
_1609180136.jpg)
- ప్రారంభించిన రైల్వేబోర్డు చైర్మన్ వినోద్
హైదరాబాద్/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రైల్వే ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ఎంఐఎస్) సేవలు దక్షిణ మ ధ్య రైల్వేలోని ఐదు దవాఖానల్లో ప్రారంభమయ్యా యి. లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్లో ఈ నెల 11 చేపట్టిన ట్రయల్ రన్ సక్సెస్‌కావడంతో సోమవారం ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో రైల్వేబోర్డు చైర్మన్, సీఈవో వినోద్‌కుమార్ యాదవ్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హెచ్ఎంఐఎస్ సేవలను ప్రారంభించారు. దీనికి సంబంధించిన మొబైల్ ఆప్లికేషన్ యూనిక్ మెడికల్ ఐడెంటిటీ కార్డును ఆయన ఆవిష్కరించారు. హెచ్ఎంఐఎస్ ద్వారా సింగిల్ విండోలో వైద్యం, వైద్య పరీక్షలు, ఫార్మసీ వంటి సేవలు రోగులకు అందుబాటులో ఉంటాయి. పేషెంట్ రిజిస్ట్రేషన్, ఓపీడీ డాక్టర్ డెస్క్, ఫార్మసీ మూడు మాడ్యూళ్లను లాలాగూడ దవాఖానలో ఇప్పటికే ప్రారంభించారు. సోమవారం ల్యాబోరేటరీ మాడ్యుల్‌ను అదనంగా చేర్చారు. హెచ్‌ఎంఐఎస్‌ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో లాలాగూడ, చిలకలగూడ, మౌలాలి, కాచిగూడ, నాంపల్లిలో, నార్తర్న్ రైల్వే పరిధిలో రెండు హాస్పిటళ్లలో అమలుచేస్తున్నారు. కార్యక్రమంలో ఎస్సీఆర్ జీఎం గజానన్ మాల్యా, రైల్వే డీజీ బీపీ నందా తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సంపూర్ణేశ్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం..!
- ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
- మెరుగ్గానే శశికళ ఆరోగ్యం
- రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా సంగక్కర
- శరీరంలో ఈ 7 అవయవాలు లేకున్నా బతికేయొచ్చు!!
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్
- ఎస్సీ, ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకం : మంత్రి ఎర్రబెల్లి
- శ్రీష్టి గోస్వామి.. ఒక్క రోజు సీఎం
- బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మసీదులు కూల్చడం ఖాయం