ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 20:05:57

ఫెరారీ కారు ఢీకొని పాదాచారుడి దుర్మరణం

ఫెరారీ కారు ఢీకొని పాదాచారుడి దుర్మరణం

హైదరాబాద్‌ : తెలంగాణ రాజధానిలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఫెరారీ కారు అతి వేగానికి ఒక పాదాచారుడు బలయ్యాడు. మాదాపూర్‌లో జరిగిన ఈ ఘటనలో ఫెరారీని నడుపుతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్‌ రత్నదీప్‌ సూపర్‌మార్కెట్‌ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఫెరారీ కారు.. రోడ్డువారగా నడుచుకుంటూ వెళ్లున్న 50 ఏళ్ల పాదచారుడిని ఢీకొట్టాడు. దాంతో తీవ్రంగా గాయపడిన పాదాచారుడు అక్కడికక్కడే మరణించాడు. కాగా, కారును నడిపి వ్యక్తి మరణానికి కారకుడైన 29 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడిని ఏసుబాబుగా, కారు నడిపిన వ్యక్తిని నవీన్‌కుమార్‌ గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ ప్రసాద్‌ చెప్పారు.


logo