సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 16:28:18

ఆస్పత్రి నుంచి దత్తాత్రేయ డిశ్చార్జ్..

ఆస్పత్రి నుంచి దత్తాత్రేయ డిశ్చార్జ్..

హైదరాబాద్: అపోలో ఆస్పత్రి నుంచి బండారు దత్తాత్రేయ డిశ్చార్జయ్యారు.   ఉదయం దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.  ఛాతిలో నొప్పి రావడంతో హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో దత్తాత్రేయకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం దత్తాత్రేయను డిశ్చార్జ్ చేశారు. కొద్ది రోజుల పాటు దత్తాత్రేయకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఆస్పత్రి నుంచి దత్తాత్రేయ రాంనగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు. 



logo