శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 12, 2020 , 01:52:44

కాళేశ్వరం నీళ్లతో అధిక దిగుబడులు

కాళేశ్వరం నీళ్లతో అధిక దిగుబడులు

వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

జమ్మికుంట: కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో చివరి ఆయకట్టు వరకు పంట లు సమృద్ధిగా పండాయని, దిగుబడులు సైతం భారీగా వచ్చాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసిన మక్కల నిల్వకోసం ఆబాది జమ్మికుంట శివారులోని 20 వేల టన్నుల సామర్థ్యం గల గోదాములను లీజ్‌కు తీసుకోగా, అందులో దిగుమతి కేంద్రా న్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌ యార్డును సందర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యం, మక్కల నిల్వల కోసం అవసరమైతే మార్కెట్‌ యార్డుల్లోని షెడ్లలో నిల్వ చేయిస్తామని చెప్పారు. ప్రైవేట్‌ గోదాములను సైతం లీజుకు తీసుకుంటామన్నారు.


logo